News April 30, 2024

కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశానికి సంబంధించి కోడ్ ఉల్లంఘనతో పాటు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మొబైల్ నంబర్ 9177435833, పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి మొబైల్ నంబర్ 7032800525, వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531లో సంప్రదించాలన్నారు.

Similar News

News March 2, 2026

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

image

హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని తెలిపారు.

News March 2, 2026

KNR: ‘ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు’

image

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి.

News March 1, 2026

KNR: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

image

కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 311 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారని, ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.