News February 7, 2026
ASF: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆన్‌లైన్ నమోదు గడువును పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ శనివారం తెలిపారు. ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ కమిషనర్ సూచనలతో ప్రభుత్వ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించామన్నారు.
Similar News
News February 8, 2026
మద్యం తాగి వాహనం నడిపితే జైలే: ఎస్పీ

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనలైజర్ల ద్వారా వాహనదారులను పరీక్షించి, మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలేనని హెచ్చరించారు. ప్రాణాలు పణంగా పెట్టి మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
News February 8, 2026
నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలు.. 11న స్థానిక సెలవు!

నల్లగొండ జిల్లాలో ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ చంద్రశేఖర్ స్థానిక సెలవు ప్రకటించారు. నల్లగొండ కార్పొరేషన్ సహా జిల్లాలోని మిర్యాలగూడ, హాలియా, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుంది. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 8, 2026
సిద్దిపేట: ఓటర్లకు కల్పించే సౌకర్యాలపై సీపీ ఆరా

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ గజ్వేల్, హుస్నాబాద్ పట్టణాల్లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రత, ఓటర్లకు కల్పించే సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని, సామగ్రి పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలును కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని సూచించారు.


