News February 7, 2026
HYD: వీకెండ్‌లో ఇక్కడికి వెళ్లండి!

వీకెండ్‌లో అనంతగిరి కొండల్లో ‘ది బ్రీజ్’ పేరుతో సరికొత్త ఎకో టూరిజం ప్యాకేజీని TGFDC లాంచ్ చేసింది. విలాసవంతమైన టెంట్‌లు, అడవి మధ్యలో ‘బుష్ బ్రేక్‌ఫాస్ట్’, గైడెడ్ సఫారీ, ట్రెక్కింగ్, Bird View ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడవి అందాలను ఆస్వాదిస్తూనే పర్యావరణాన్ని కాపాడేలా ఈ టూర్‌ను డిజైన్ చేశారు. ఈ టూర్ మీకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముగ్గురికి రూ.5000. ఇక సర్దేయండి.
Site: deccanwoodsandtrails.com
Similar News
News February 20, 2026
HYD: 60% వరకు రాయితీతో బైకులు

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
News February 20, 2026
రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
News February 20, 2026
HYD: రోజుకు ₹70తో ఇవన్నీ సాధ్యమా?

అమీర్‌పేట్ సర్కార్ హోమ్లోని 505 మంది ఇన్‌మేట్స్ కోసం రూ.1.27CRతో మెనూ సిద్ధమైంది. ఆదివారం చికెన్, నిత్యం రాగిజావ, పల్లీలడ్లు, పండ్లు, గుడ్లు ఇవన్నీ రాజభోగంలా ఉన్నా.. నెలకు ఒక్కరికి కేటాయించింది ₹2,100 మాత్రమే. అంటే రోజుకు ₹70 అన్నమాట. దీంతో ఇది సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. గుడ్డు ₹6, పాలు లీటర్ ₹85- 90, గ్యాస్ దాదాపు ₹2వేలు సర్కార్ ఫిక్స్ చేసిన ₹70తో ఇవ్వన్నీ అందించడం కత్తిమీద సామే.


