News February 7, 2026
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆశిల్ మెట్ట జంక్షన్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించనున్న బడ్జెట్ ప్రచార అభియాన్-2026 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం 4.40 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
Similar News
News April 20, 2026
భీమిలిలో వ్యక్తి ఆత్మహత్య

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మైలపల్లి సతీశ్ (35) చాకుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఈ ఘటనకు కారణమని భీమిలి ఎస్ఐ సురేశ్ తెలిపారు.
News April 20, 2026
విశాఖ రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విశాఖలోని పలు రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జేసీ విద్యాధరి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్లో నైట్ వాచ్మెన్ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్లో నైట్ వాచ్మెన్, సీతమ్మధార రైతుబజార్లో స్వీపర్, ఆరిలోవ రైతుబజార్లో డే వాచ్మెన్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
News April 20, 2026
విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.


