News February 7, 2026

సిద్దవటం: రైలు ఢీకొని తల్లీకూతురు మృతి

image

సిద్దవటం మండలం కనుమల్లోపల్లి వద్ద రైలు ఢీకొని <<19077063>>ఇద్దరు వృద్ధ మహిళలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలను ఇవాళ సాయంత్రం రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరు మాధవరం-1, 16వ వీధికి చెందిన రామలక్షుమ్మ (75), లక్షుమ్మ(50), వీరిద్దరు తల్లీకూతుళ్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Similar News

News February 18, 2026

బ్యాటరీ రెంటల్ కార్లు.. ఏంటీ విధానం?

image

ఈ విధానంలో కస్టమర్ కేవలం కారే కొనుగోలు చేస్తాడు. బ్యాటరీ కాదు. బ్యాటరీని షోరూమ్ రెంట్‌కి ఇస్తుంది. నెలకు మినిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటుంది. ఆపై ఎన్ని కి.మీ ఎక్కువ తిరిగితే దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తుంది. కారు కొనుగోలు సమయంలో కస్టమర్‌పై అధిక భారం పడొద్దనే కంపెనీలు బ్యాటరీ రెంటల్ విధానాన్ని తీసుకొచ్చాయి. మార్కెట్లో ఇప్పటికే MG విండ్సర్ ఇలాగే రన్ అవుతుండగా తాజాగా మారుతీ <<19171974>>ఈ-విటారా<<>> వచ్చింది.

News February 18, 2026

కర్నూలు: 14 మంది విద్యార్థుల డిబార్

image

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 14 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు తెలిపారు. వీరంతా మంగళవారం జరిగిన పరీక్షలో చూచిరాతకు పాల్పడ్డారని చెప్పారు. KDC, సెయింట్ జోసఫ్, STBC, రావుస్, GDC నంద్యాల, జ్యోతిర్మయి, శ్రీ వేంకటేశ్వర, సిద్ధార్థ, నందరాం, ఆలూరు, సాయిరాం, తదితర కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు.

News February 18, 2026

IFR-ఎప్పుడు ఎక్కడ జరిగింది?

image

✦2001 ముంబయి: భారత్‌లో తొలి ఐఎఫ్ఆర్ నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ సమీక్షించారు.
✦2016 విశాఖ: రెండోసారి విశాఖలో జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.
✦2026 విశాఖ: తాజా ఐఎఫ్ఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నారు.
✦సుమారు 71 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయి.
✦ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రజలకు ప్రత్యేక ఆకర్షణ