News February 7, 2026
కల్వకుర్తి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్థానిక డీఎస్పీ వెంకటరెడ్డి పరిశీలించారు. సీఐ నాగార్జునతో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలలో 20 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 20, 2026
హెరిటేజ్‌పై సభలో చర్చ పెట్టాల్సిందే: బొత్స

AP: హెరిటేజ్-ఇందాపూర్ <<19189089>>డెయిరీపై<<>> సభలో చర్చ పెట్టాల్సిందేనని YCP MLC బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దేవుడి సొమ్మును లూటీ చేస్తున్నారని ఆరోపించారు. హెరిటేజ్ ప్రైవేటు సంస్థ అని, దాని గురించి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామి ఫొటోలు, బ్యానర్లతో YCP MLCలు మండలికి ర్యాలీగా వెళ్లారు. ‘కల్తీ నెయ్యి’ వ్యవహారంపై హిందూ సమాజానికి CM చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు.
News February 20, 2026
NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 20, 2026
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.


