News February 8, 2026
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటే: మంత్రి అడ్లూరి

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News February 11, 2026
ఈనెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా

ప్రభుత్వం మేనిఫెస్టో సాక్షిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని, దీనికి నిరసనగా ఈనెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నామని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్పీ కుంట జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయ సమావేశం సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
News February 11, 2026
CMETలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(CMET) 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in
News February 11, 2026
నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ సాధ్యమేనా?

ప్రసవ సమయంలో మహిళలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. అయితే నార్మల్ డెలివరీలోనూ నొప్పిలేకుండా డెలివరీ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. నొప్పులు మొదలై గర్భాశయ ముఖద్వారం కనీసం 4సెంటీమీటర్లు తెరుచుకున్నాక మత్తు డాక్టర్ సాయంతో ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా ఇస్తారు. దీనివల్ల సంకోచ వ్యాకోచాలకు ఇబ్బంది ఉండదు. ఏవైనా కాంప్లికేషన్లు వచ్చి నార్మల్ డెలివరీ కాకపోతే వెంటనే సిజేరియన్ చేయొచ్చని సూచిస్తున్నారు.


