News April 30, 2024

ఓయూలో నీటి కొరతపై జలమండలి వివరణ

image

TG: ఓయూలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని వస్తున్న వార్తలపై జలమండలి వివరణ ఇచ్చింది. ‘క్యాంపస్‌కు ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన దానికంటే ఎక్కువే సరఫరా చేస్తున్నాం. జలమండలి ఉన్నతాధికారులు సంబంధిత ఏఈతో కలిసి క్యాంపస్‌ను సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరం అయితే మరింత నీరు సరఫరా చేస్తాం’ అని తెలిపారు.

Similar News

News February 8, 2026

అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

image

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.

News February 8, 2026

AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<>ERA<<>>) 3డేటా అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in

News February 8, 2026

అన్నదానం ఎంత పుణ్యమో..

image

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.