News April 30, 2024
బర్త్ డే వేడుకల్లో హిట్ మ్యాన్

ముంబై మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబై ఆటగాళ్లతో పాటు తన భార్య రితిక సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. మరోవైపు రోహిత్ శర్మకు తోటి ప్లేయర్లు, అభిమానులు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందివ్వాలని పోస్టులు పెడుతున్నారు.
Similar News
News July 5, 2025
దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి

TG: ప్రియుడి మోజులో భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నారాయణపేట (D) కోటకొండకు చెందిన అంజిలప్ప(32) తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలో గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.
News July 5, 2025
ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్‌లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్‌పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.
News July 5, 2025
నిరాశ వద్దు మిత్రమా.. విజయం తథ్యం!

మీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని నిరాశ చెందుతున్నారా? తిరస్కరణలు, నష్టాలు మీకు అడ్డంకులు కావు.. అవి ప్రక్రియలో భాగం అని తెలుసుకోండి. యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ వైరల్ అవ్వకముందు 455 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆర్టిస్ట్‌గా ఫేమస్ కాకముందు పికాసో 20 వేల పెయింటింగ్స్ వేశారు. కల్నల్ సాండర్స్ KFC ఏర్పాటు చేయకముందు 1009 సార్లు ఫెయిల్ అయ్యారు. మీలా వీళ్లు కూడా అనుకుంటే సక్సెస్ అయ్యేవారా ఆలోచించండి.