News April 30, 2024

యమపాశాలుగా హైవేలపై పార్కింగ్(2/2)

image

TG: రోడ్లపై పార్కింగ్, నివారణ చర్యలు లేకపోవడం, ఓవర్ స్పీడ్, డ్రైవర్లు అలసిపోవడం ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు ఇలాంటి పార్కింగ్‌ల పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఏమైనా సమస్య వచ్చి వాహనాలు రోడ్లపై నిలిచిపోతే ఇతర వెహికల్స్‌ను అలర్ట్ చేసేందుకు సెఫ్టీ ట్రయాంగిల్‌ను ఉపయోగించాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News September 19, 2025

ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

image

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

News September 19, 2025

నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

image

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News September 19, 2025

23 రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (<>కోల్‌కతా<<>>) 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 3.