News February 8, 2026

అనంత: ‘తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని హత్య’

image

ఈనెల 1న బొమ్మనహాల్ మండలం కొలగానహళ్లిలో జరిగిన కావలి రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. కావలి రమేశ్ తన తల్లితో అక్రమ సంబంధం కారణంగా కావలి మహేంద్ర కక్ష పెంచుకుని మరో ఆరుగురితో కలిసి నరికి చంపారని సీఐ తెలిపారు. నిందితుడితో పాటు సహకరించిన తిప్పేస్వామి, బోయ రమేశ్, సోమశేఖర్‌ను అరెస్టు చేశామన్నారు.

Similar News

News February 21, 2026

పీఎం సూర్యఘర్ అమలులో పురోగతి సాధించాలి: కలెక్టర్

image

PM సూర్యఘర్, PM కుసుం పథకాల అమలులో జిల్లా యంత్రాంగం వేగంగా పురోగతి సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి CS విజయానంద్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, హాస్టళ్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యం గంజాయి నియంత్రణపై సమీక్షించారు. విద్యుత్ పొదుపుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

image

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్‌లో టాప్-4 సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.