News April 30, 2024

నేడు టెన్త్ ఫలితాలు..

image

TG: నేడు టెన్త్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

Similar News

News February 4, 2026

ఇంజినీరింగ్ అర్హతతో 379 పోస్టులు

image

ఇండియన్ ఆర్మీ 379 ఆఫీసర్ పోస్టులను 67వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్నికల్) కోర్సు ద్వారా భర్తీ చేయనుంది. BE, BTech అర్హతగల మహిళలు FEB 4వరకు, పురుషులు FEB 5వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-27ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500. వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News February 4, 2026

4KM సముద్రంలో ఈది కుటుంబాన్ని రక్షించిన 13 ఏళ్ల బాలుడు!

image

ఆస్ట్రేలియాకు చెందిన ఆస్టిన్ అపెల్బీ అనే 13 ఏళ్ల బాలుడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. సముద్రంలో 4 గంటలు ఈదాడు. పెడల్ బోటింగ్ చేస్తూ సముద్రంలో చిక్కుకున్న తల్లి, తోబుట్టువులను రక్షించేందుకు 4KM ఈది ఒడ్డుకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో 14KM దూరంలో కొట్టుకుపోయిన వారందరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారు సురక్షితంగా ఉండగలిగారు.

News February 4, 2026

ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఢిల్లీ <<>>హైకోర్టు 152 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ FEB 27 వరకు చేసుకోవచ్చు. వయసు 18- 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్(డిస్క్రిప్టివ్) పరీక్ష, టైప్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1300. సైట్: delhihighcourt.nic.in