News April 30, 2024
మంగళగిరి: నవతరం పార్టీ అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ పోలిన గుర్తు

నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు ఎన్నికల కమిషన్ గ్లాస్ టంబ్లర్ పోలిన గుర్తు కేటాయించింది. మంగళగిరి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో సుబ్రహ్మణ్యం పోటీకి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన అభ్యర్థనకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి రాజకుమారి గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News March 12, 2026
గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
News March 12, 2026
గుంటూరు: పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 133 మంది కేసులు

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన ఈ డ్రైవ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 133 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 58 ఎఫ్‌ఐఆర్‌లు, 60 పెట్టి కేసులు ఉన్నాయి. బహిరంగ మద్యపాన రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.
News March 12, 2026
గుంటూరులో విషాదం

గుంటూరు కాకుమానువారితోటకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాఘవ (14) మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని తండ్రి రాము ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవ తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి అరండల్ పేట 8/4 లో మామిడి కాయలు కోస్తుండగా బావిలో పడ్డాడు. ఈ క్రమంలో ఊపిరాడక రాఘవ మృతిచెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


