News February 8, 2026
తల్లీ బిడ్డలు మృతి.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

పుత్తూరులో పద్మ ఇద్దరు పిల్లలతో <<19079819>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన తెలిసిందే. ‘సంపాదన లేని భర్తతో వేగలేక, కుటుంబాన్ని నెట్టుకురాలేక నేను ఇబ్బందులు పడ్డా. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. భార్యా పిల్లలను పోషించలేని వాడు పెళ్లెందుకు చేసుకోవాలి. మేము చనిపోతున్నాం. ఇక నువ్వు హ్యాపీగా ఉండు. అన్న నన్ను క్షమించి. 8ఏళ్లు అవుతుంది నీతో మాట్లాడి’అని ఆమె సూసైడ్ లేఖ రాసింది.
Similar News
News February 19, 2026
కర్నూలు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ గీత తెలిపారు. 5వ తరగతితో పాటు 6-10 తరగతుల్లో మిగులు సీట్లు, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల వారు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News February 19, 2026
మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?
News February 19, 2026
తిరుపతి కలెక్టర్ కీలక ఆదేశాలు

తిరుపతిలో గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే రెవెన్యూ, భూసంబంధిత అర్జీలను పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రీసర్వే, కుల ధృవీకరణ పత్రాల వంటి సేవలను ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని సూచించారు. అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సంతృప్తికర పరిష్కారం అందించాలని కోరారు.


