News February 8, 2026

జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి.. నివారణ ఎలా?

image

ప్రస్తుతం జీడిమామిడి తోటల్లో ‘టీ దోమల’ ఉద్ధృతి పెరిగింది. ఇవి పంట లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. వీటిని సకాలంలో నివారించకుంటే పంట దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ తేయాకు దోమల కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణకు నిపుణుల సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

Similar News

News February 25, 2026

HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

image

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.

News February 25, 2026

రేపే రష్మిక-విజయ్ పెళ్లి.. ముహూర్తం ఎన్ని గంటలకంటే?

image

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి. వేదమంత్రాల సాక్షిగా రేపు ఉదయం 8 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు వైభవంగా జరిగాయి. పెళ్లికి ముందు రష్మికకు విజయ్ తల్లి వారసత్వపు గాజులను కానుకగా ఇచ్చారట. ఇక వాళ్లు కనిపించకుండా కేవలం వేడుకల ఏర్పాట్ల ఫొటోలనే వారిద్దరూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు.

News February 25, 2026

మోదీ ఇజ్రాయెల్ ట్రిప్‌పై రాహుల్ విమర్శలు

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్‌స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌‌లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.