News April 30, 2024
NZB: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!
MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. నిజామాబాద్ 29 నామినేషన్లు ఆమోదించగా.. 3 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. ఎక్కువ మంది బరిలో ఉండటంతో రెండు ఈవీఎంలు తప్పనిసరైంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. SHARE IT
Similar News
News November 5, 2024
NZB: మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ షాప్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు మెడికల్ షాప్ తాళం పగులగొట్టి లోనికి చొరబడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2024
ఖతర్‌లో ముప్కాల్ వాసి గుండెపోటుతో మృతి
ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాడూరి లింబాద్రి (58) గురువారం రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా దోహాలో ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
News November 5, 2024
కామారెడ్డి: రైలు దిగుతుండగా కిందపడి వ్యక్తి మృతి
రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు HYD కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపారు. కామారెడ్డికి చెందిన జీడి సిద్దయ్య (70) వికారాబాద్ నుంచి రైలులో వస్తు విద్యానగర్ రైల్వే స్టేషన్లో దిగుతుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.