News April 30, 2024
నేడు NDA మేనిఫెస్టో విడుదల

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు CBN, పవన్, ఇతర బీజేపీ నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు. పెన్షన్లు రూ.4వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మెగా డీఎస్సీపై మొదటి సంతకం, వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు వంటి హామీలతో NDA అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.
Similar News
News February 2, 2026
మత్స్యకారులకు బడ్జెట్‌లో భరోసా

మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. భారత నౌకలు అంతర్జాతీయ జలాల్లో వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఇది డీప్‌సీ ఫిషింగ్ చేసే బోటు యజమానులకు ఊరటగా చెప్పవచ్చు. అలాగే రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌లో వాడే ముడిసరుకుల దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని 1% నుంచి 3%కు పెంచారు. ఇది ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.
News February 2, 2026
చలికాలంలో జుట్టు ఊడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి కేశాల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తలస్నానానికి గోరువెచ్చని నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ అప్లై చేయడం మరచిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయర్ వాడటం తగ్గించాలి. ఈ సీజన్లో తల వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. దీని వల్ల తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
News February 2, 2026
పిండి దీపం వెలిగిస్తూ పఠించాల్సిన మంత్రాలు

పిండి దీపం వెలిగించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ‘గోవింద నామాలు’ కూడా పలకొచ్చు. ‘శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి’ పఠించడం మరింత శ్రేష్టం. వీలైతే ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ చదువుకోవడం ఉత్తమం. ఈ మంత్రోచ్ఛారణ స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. భక్తితో చేసే ఈ నామ స్మరణ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగి, మానసిక ధైర్యం కలుగుతుంది.


