News February 8, 2026
శేష వాహన సేవలో మన్యంకొండ శ్రీవారు

మన్యంకొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశేషమైన శేష వాహన సేవ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆదిశేషునిపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శేష వాహన సేవను దర్శించడం వల్ల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
Similar News
News February 10, 2026
HYD: గాజులరామారంలో కంపించిన భూమి

గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడలో ఉ.10:10గంటలకు ఒక్కసారి పెద్దగా భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం భయబ్రాంతులతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్‌మెంట్‌వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గూమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాలు వచ్చిన శబ్దమా అని వారు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News February 10, 2026
వేములవాడ: పోలింగ్‌కు ‘సామగ్రి’ సిద్ధం

వేములవాడ పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైంది. 28 వార్డుల్లో 58 పోలింగ్ కేంద్రాలలో 10 మంది రిటర్నింగ్ అధికారులు, 10 మంది ఏఆర్‌వోలు, 58 మంది పీవోలు, 232 మంది ఓపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా ఎన్నికల సహాయ అధికారి కే.సంపత్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు.
News February 10, 2026
ఎంజీఎం ల్యాబ్‌లో నిలిచిన సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు

ఎంజీఎం ఆస్పత్రిలోని సెంట్రల్ ల్యాబ్‌లో సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు జరగడం లేదు. కెమికల్ కొరత కారణంగా పరీక్షలు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా అత్యవసర రోగులే ఉంటారు. చికిత్సకు ముందు సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ పరీక్ష ఆస్పత్రిలో లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పరీక్షలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు.


