News February 8, 2026
మున్సి‘పోల్స్’: వలస ఓటర్లకు ఫ్లైట్ టికెట్లు.. ముంబై వెళ్లి ప్రచారం

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డి గూడెం, తంగడపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. వారిని రప్పించేందుకు విమానం, రైలు, బస్సు ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్వయంగా ముంబైకి వెళ్లి ప్రచారం కూడా చేశారు.
Similar News
News February 10, 2026
జూన్ తర్వాత ఎల్‌నినో.. ‘నైరుతి’పై ప్రభావం!

దేశంలో జూన్ తర్వాత ఎల్‌నినో ఏర్పడేందుకు 50 శాతం ఛాన్స్ ఉందని స్కైమెట్ అంచనా వేసింది. సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో అవకాశం 70 శాతానికి చేరొచ్చని తెలిపింది. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. దీనివల్ల మన దేశంలో వర్షాలు తగ్గిపోతే దక్షిణ అమెరికాలో భారీ వర్షాలు కురుస్తాయి.
News February 10, 2026
లేబర్ కోడ్‌లపై పోరు.. ఎల్లుండి బంద్

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన <<18354721>>నాలుగు లేబర్ కోడ్‌లకు<<>> వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నాయి. AP, TG సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ లేబర్ కోడ్‌లతో ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్‌లకు కార్మికులు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ కోడ్‌లను రద్దు చేసి గతంలోని 29 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
News February 10, 2026
‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’.. కాంగ్రెస్vsబీజేపీ

TG: కరీంనగర్ మేయర్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మేయర్ సీటు కోసం కాంగ్రెస్-ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అయితే బండి వ్యాఖ్యల్లో నిజం లేదని, డీల్ నిజమైతే జైళ్లో పెట్టాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా దీనిపై విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్ చేశారు.


