News February 8, 2026

విశాఖ: వేసవికి వాటర్ టెన్షన్ లేనట్లేనా..!

image

విశాఖకి వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి గెడ్డ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ కొనసాగుతోందని GVMC నీటి సరఫరా అధికారి పల్లంరాజు స్పష్టం చేశారు.

Similar News

News April 17, 2026

జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

image

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్‌-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్‌కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సమీక్షలో మాట్లాడరు. ఏప్రిల్ 27న ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమానికి సుమారు 25 వేల మంది హాజరుకానున్నారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్, ఎల్ఈడీ స్క్రీన్లు పటిష్ఠంగా ఉండాలన్నారు.