News April 30, 2024
నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ ప్రచారం

TG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మ.2గంటలకు హుజూరాబాద్ జనజాతర సభ, సా.4గంటలకు వరంగల్‌లోని భూపాలపల్లి సభ, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రా.7గంటలకు బాలాపూర్, బడంగ్‌పేట కార్నర్ మీటింగ్‌లకు, రా.9గంటలకు ఆర్కేపురం, సరూర్‌నగర్ కార్నర్ మీటింగ్‌లకు హాజరవుతారు.
Similar News
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
News January 25, 2026
సూర్యుడు దేవుడా..?

కాలం అత్యంత శక్తిమంతమైనది. అది సృష్టిని నిర్మిస్తుంది. తిరిగి తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ కాలం కంటికి కనబడదు. అలాంటి కాలాన్ని కొలిచే ప్రమాణమే సూర్యుడు. ఆయన వేసే ప్రతి అడుగు కాలానికి కొలమానం వంటిది. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, రోజులు, నెలలు అన్నీ సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే కంటికి కనిపించని దైవానికి, కంటికి కనిపించే రూపమే సూర్యుడని నమ్ముతాం. ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం.
News January 25, 2026
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.


