News February 8, 2026

బీజేపీ అంటే గుణ వంతుల పార్టీ: బండి సంజయ్

image

BJP గుణవంతుల పార్టీ అని, ధనవంతుల పార్టీ కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చొప్పదండిలో ఇవాళ బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజాయితీగా పని చేయడం, ధర్మం కోసం నిలబడడమే BJPకి తెలుసన్నారు. ఈ మేరకు చొప్పదండిలో అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. దొంగ హామీలు ఇవ్వమని, అవినీతి చేయమని, అభివృద్ధి మాత్రమే చేస్తామన్నారు. గెలిచిన తర్వాత అమ్ముడుపోమని, ప్రలోబాలకు లొంగి పార్టీ మారమని ప్రమాణం చేయించారు.

Similar News

News February 26, 2026

మన్యం: 3 రోజుల క్రితమే వచ్చి అంతలోనే మృత్యవాత.. జవాన్ వివరాలివే

image

జియ్యమ్మవలస(M) శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దవలసింగి చంద్రమౌళి(29) గిజబ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామస్థుల వివరాలు మేరకు మృతుడు.. గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం వివాహమైందని భార్య, సంవత్సరం వయస్సున్న పాప ఉన్నారన్నారు.

News February 26, 2026

శ్రీశైలంలో అగ్నిప్రమాదాలు.. ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఎక్కడ?

image

శ్రీశైల దేవస్థానం పరిధిలోని కాటేజీలు, నిత్య అన్నదాన సత్రాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతనెల 21న, నేడు జరిగిన అగ్నిప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఫైర్ ఎక్విప్‌మెంట్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గించవచ్చని భక్తులు చెబుతున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, సత్రాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News February 26, 2026

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in