News February 8, 2026

సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పక్కా కార్యాచరణ రూపొందించామని ఆమె తెలిపారు. పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 19, 2026

కర్నూలు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ గీత తెలిపారు. 5వ తరగతితో పాటు 6-10 తరగతుల్లో మిగులు సీట్లు, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల వారు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News February 19, 2026

మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

image

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?

News February 19, 2026

తిరుపతి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

తిరుపతిలో గ్రీవెన్స్ డే ద్వారా వచ్చే రెవెన్యూ, భూసంబంధిత అర్జీలను పారదర్శకంగా, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రీసర్వే, కుల ధృవీకరణ పత్రాల వంటి సేవలను ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని సూచించారు. అధికారులు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సంతృప్తికర పరిష్కారం అందించాలని కోరారు.