News February 8, 2026
కృష్ణా: అమరావతి ORR వెడల్పుపై స్పష్టత.. రైతులకు ఊరట!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పుపై నెలకొన్న ఆందోళనలకు NHAI అధికారులు తెరదించారు. ఇటీవల గెజిట్‌లో 250 మీటర్లుగా పేర్కొన్నప్పటికీ, రోడ్డు వెడల్పు 140 మీటర్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మలుపులు, బఫర్ జోన్ల కోసం శాటిలైట్ సర్వేలో అదనపు విస్తీర్ణం చూపించాల్సి వచ్చిందని వివరించారు. 189 కి.మీ పొడవునా 5 జిల్లాలు, 23 మండలాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టులో 140 మీటర్ల మేరకే రాళ్లు నాటనున్నట్లు తెలిపారు.
Similar News
News February 13, 2026
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో NOV 2025లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ వొకేషన్ 3వ సెమిస్టర్, AUG 2025లో నిర్వహించిన డిప్లొమా ఇన్ మ్యూజిక్(వోకల్) రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News February 13, 2026
గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.