News February 8, 2026

విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

image

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి‌లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.

Similar News

News February 11, 2026

CMETలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ(CMET) 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech/MSc/ME/MTech/PhD, MBA/PGDM/MMS/MCom, BCom, పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cmet.gov.in

News February 11, 2026

నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ సాధ్యమేనా?

image

ప్రసవ సమయంలో మహిళలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. అయితే నార్మల్ డెలివరీలోనూ నొప్పిలేకుండా డెలివరీ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. నొప్పులు మొదలై గర్భాశయ ముఖద్వారం కనీసం 4సెంటీమీటర్లు తెరుచుకున్నాక మత్తు డాక్టర్‌ సాయంతో ఎపిడ్యూరల్‌ ఎనాల్జీషియా ఇస్తారు. దీనివల్ల సంకోచ వ్యాకోచాలకు ఇబ్బంది ఉండదు. ఏవైనా కాంప్లికేషన్లు వచ్చి నార్మల్ డెలివరీ కాకపోతే వెంటనే సిజేరియన్‌ చేయొచ్చని సూచిస్తున్నారు.

News February 11, 2026

అరటిలో కాయ ముచ్చిక కుళ్లు తెగులు- నివారణ

image

ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలను ఎక్కువగా ఆశిస్తుంది. కాయల చివర ముచ్చిక వద్ద నల్లగామాడిన కుళ్లు మచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనబడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనిపించి క్రమేపీ చాలా కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు గెలలు పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.