News April 30, 2024
ఎంపీగా నామా గెలిస్తే కేంద్రమంత్రి అవుతాడు: కేసీఆర్

ఖమ్మం నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. పాలేరును ఎండబెట్టిన పాపం మంత్రులదేనన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతాడని పేర్కొన్నారు. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరిగే అవకాశం ఉందని వివరించారు.
Similar News
News November 11, 2025
ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియామకం

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవులో ఉన్న జైనీని ఖమ్మం డీఈవోగా నియమించారు. ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శ్రీజ స్థానంలో రెండు రోజుల్లో చైతన్య జైనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి అధికారిని నియమించాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.
News November 11, 2025
ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.
News November 11, 2025
ఖమ్మం: ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయిల్ పామ్ లాభసాటి పంట అని అన్నారు. వరి, పత్తి, మిర్చి పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.50వేల సబ్సిడీతో పాటు ప్రభుత్వం డ్రిప్, నిర్వహణ ఖర్చులకు సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం జిల్లాకు 14,500 ఎకరాల సాగు లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.


