News February 8, 2026
HYD: WHAT AFTER 10th మెగా సెమినార్

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్‌తో పాటు తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉప్పల్‌లో పెద్దఎత్తున ఉచిత అవగాహన సదస్సు నిర్వహించాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Conventionలో నిర్వహించిన ఈ సెమినార్‌లో ముఖ్య అతిథిగా CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
News March 21, 2026
BREAKING: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే మృతి

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన హనుమంతరాయ చౌదరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News March 21, 2026
పోలవరం జిల్లా మొదటి కలెక్టర్ ఈయనే..!

పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, ఇకపై పోలవరం జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి అల్లూరి జిల్లా కలెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు దినేశ్ కుమార్ మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


