News February 9, 2026
డెడ్‌లైన్‌లోపు నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

ఆర్థిక నెట్‌వర్క్‌లను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలిచ్చాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భద్రతా వ్యూహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకంగా మారాయన్నారు. మార్చి 31లోపు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలపై పలు రాష్ట్రాల, కేంద్ర సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించినట్టు SMలో పోస్ట్ పెట్టారు.
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.


