News February 9, 2026
పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం రేపు విజయవాడలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడిల కాన్ఫరెన్స్ ఉందన్నారు. ఈ కారణంగా పీజీఆర్ఎస్‌కు సమస్యలతో అర్జీదారులు ఎవరూ కార్యాలయానికి హాజరుకావద్దని ఎస్పీ కోరారు.
Similar News
News February 13, 2026
కాగజ్‌నగర్‌లో తొలి విజయం BJPదే

SKZR మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో BJP ఖాతా తెరిచింది. 21వ వార్డులో అభ్యర్థి దూసరి కృష్ణవేణి ఘన విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాలను, తనను నమ్మి ఓటు వేసిన ఓటర్లకు ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభివృద్ధియే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు విజయోత్సవంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
News February 13, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. UPDATES

*యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
*కాగజ్‌నగర్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
*ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా) 13, 15వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం
*కొల్లాపూర్ 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 4, 11, 12 వార్డుల్లో BRS విజయం
*రామాయంపేట పదో వార్డులో BRS గెలుపు


