News April 30, 2024
MBNR:తేలిన అభ్యర్థుల లెక్క.. హోరెత్తనున్న ప్రచారం

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపై దృష్టిసారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13న లోక్ సభ ఎన్నికలు ఉండగా.. ఒకరోజు ముందుగానే పార్టీల ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంది.
Similar News
News March 12, 2026
MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
News March 12, 2026
ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి ముప్పు

పేదల తిరుపతిగా పేరుగాంచిన ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి రానున్న కాలంలో ముప్పు తలపించే అవకాశం ఉందని దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తుతుమంత్రంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. మొత్తానికి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్రషర్ మిషన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఉండే ఏడుకొండలను తవ్వాలని ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.
News March 12, 2026
MBNR: SZ..16,17న KHO-КНО ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 16న స్త్రీలకు, 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్. శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తో హాజరు కావాలన్నారు. SHARE IT


