News April 30, 2024

MNCL: ప్రేమించిన యువతి దక్కతుందో లేదోనని సూసైడ్

image

ప్రేమించిన యువతి తనకు దక్కుతుందో.. లేదో.. తమ పెళ్లి జరుగుతుందో.. లేదోనని ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేమనపల్లి చోటుచేసుకుంది. SI శ్యామ్ పటేల్ ప్రకారం.. సంపుటంకు చెందిన నితిన్(20) గోదావరిఖనికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి ఖరారు చేసుకుందామని నచ్చజెప్పారు. అయినప్పటికీ తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందనే భయపడి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.

Similar News

News January 11, 2025

బాసర ఆర్జీయూకేటీకీ JAN13 నుంచి సెలవులు

image

బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో చదివే పీయూసీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులను వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు సెలవులిచ్చారు. 19న ఆదివారం సాధారణ సెలవుదినం రావడంతో తరగతులు 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

News January 11, 2025

ASF: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.. నిందితుడికి జైలు శిక్ష 

image

మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటో డ్రైవింగ్ చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ ఆటో నడుపుతుండగా.. ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.