News April 30, 2024

ఖమ్మం: ఒకే వేదికపై ముగ్గురు మంత్రులు.. ఫుల్ జోష్

image

ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి మంత్రులు మల్లు భట్టి, పొంగులేటి, తుమ్మల దిగటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఖమ్మం లోక్‌సభ స్థానం సీటును తమ కుటుంబీకులకు దక్కించుకోవాలని పోటీ పడిన విషయం తెలిసిందే. అనేక సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం రఘురాంరెడ్డికి దక్కింది. ఈ స్థానంలో మెజార్టీ సాధించాలనే సంకల్పంతో ముగ్గురు ఒకే తాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ‌ప్రకటించారు.

Similar News

News March 26, 2026

ఖమ్మం: మద్ధతు ధర లేక రైతుల విలవిల

image

ఖమ్మం జిల్లాలో యాసంగి పెసర రైతులకు మద్దతు ధర దక్కక కన్నీరు మిగులుతోంది. ప్రభుత్వం క్వింటాకు ₹8,882 ధర నిర్ణయించినా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ₹7,000 లోపే చెల్లిస్తున్నారు. నాణ్యత సాకుతో మరికొంత ధర తగ్గిస్తుండటంతో రైతులు క్వింటాకు ₹1,800 పైగా నష్టపోతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పెసర రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News March 25, 2026

2 చోట్ల ఓటుంటే చట్టరీత్యా నేరం: అ.కలెక్టర్‌ శ్రీజ

image

వైరా: ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా, పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీజ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల చేర్పులపై నియోజకవర్గ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరమని ఆమె స్పష్టం చేశారు.