News February 9, 2026

కిరాణాషాపులకు దెబ్బ?

image

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?

Similar News

News February 25, 2026

5 OTTలను బ్యాన్ చేసిన కేంద్రం

image

అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 5 OTT యాప్స్‌పై కేంద్రం వేటు వేసింది. MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel, Jugnu అనే ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. అసభ్యకరమైన వీడియోలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులతో IT రూల్స్ 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఇకపై ఇవి ఇండియాలో పనిచేయవు.

News February 25, 2026

విజయానికి నాలుగు సూత్రాలు

image

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకః|
మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః|
మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి సాగును నమ్ముకుంటే ఆకలి చావులు ఉండవని ఈ శ్లోకం చెబుతోంది. శ్లోకార్థం: కృషి ఉంటే కరవు ఉండదు. జపం చేస్తే పాపాలు నశిస్తాయి. మౌనం వహిస్తే కలహాలు రావు. అప్రమత్తంగా ఉంటే భయం ఉండదు.

News February 25, 2026

గట్ హెల్త్‌కు ఇవి సూపర్ ఫుడ్స్

image

ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం. అందుకే రోజూ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, కిమ్చీ వంటివి తీసుకోవాలి. ఉడికించి చల్లార్చిన చిలగడదుంపలు, కొంచెం నెయ్యి పేగులకి చాలా మంచివి. అలాగే కలోంజీ టీ తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. డైట్‌లో ఫైబర్ చేర్చుకునేటప్పుడు ఒక్కసారిగా కాకుండా మెల్లగా పెంచడం మంచిది.