News February 9, 2026
నేరాల కట్టడికి ఎస్పీ కొత్త అస్త్రం.. జిల్లాలో “పల్లెనిద్ర” షురూ!

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రకటించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయిలో భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
News February 21, 2026
నల్లజర్ల: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 21, 2026
సంక్షేమ పథకాలే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించి వివరాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు.


