News April 30, 2024

పార్టీలను చీల్చి.. ఆదరణ కోల్పోయి!

image

మహారాష్ట్ర రాజకీయాలు పార్టీల చీలికలకు కేరాఫ్ అడ్రస్. శివసేనను చీల్చి ఏక్‌నాథ్ శిండే BJPతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరో నేత అజిత్ పవార్ సైతం NCPని చీల్చి NDAలో చేరారు. అయితే.. వీరిద్దరికీ ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్రలో NDAకు ఈ ఎన్నికలు కఠిన పరీక్షగా మారనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫలానా పార్టీలో ఏక్‌నాథ్ శిండేలున్నారని సెటైర్లు వేయడం మనం చూస్తూనే ఉన్నాం.

Similar News

News March 13, 2026

రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

image

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.

News March 13, 2026

ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

image

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.

News March 13, 2026

పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

image

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.