News February 9, 2026
రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.
Similar News
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్‌కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.
News February 26, 2026
కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలి: కేంద్ర మంత్రి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ ఆదాయంలో కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుల నుంచి మారుమూల ప్రాంతాల క్రియేటర్ల వరకు అందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోతున్నాయని, పబ్లిష్ అయ్యే ప్రతీ కంటెంట్‌కూ ఆయా ప్లాట్‌ఫామ్స్ బాధ్యత వహించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్‌లో అన్నారు.
News February 26, 2026
బెన్నెట్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 రన్స్

T20WC: భారత్‌పై 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పోరాడుతోంది. శివమ్ దూబే వేసిన 15వ ఓవర్‌లో ఏకంగా 26 రన్స్ వచ్చాయి. అందులో బెన్నెట్ 2 సిక్సులు, 2 ఫోర్లు, ఓ టుడీ బాదారు. మిగతావి వైడ్లు, నో బాల్ ద్వారా యాడ్ అయ్యాయి. ప్రస్తుతం 78 పరుగుల వద్ద ఉన్న బెన్నెట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. జింబాబ్వే స్కోర్ 16.2 ఓవర్లకు 144/3గా ఉంది.


