News April 30, 2024

ప.గో.: టీడీపీ నుంచి శివరామరాజు సస్పెండ్

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News March 11, 2026

ప.గో: లైంగిక దాడి కేసులో పదేళ్లు జైలు

image

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి భీమవరం పోక్సో కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. 2021లో నడిపూడికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదైంది. తర్వాత నిందితుడు గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.

News March 11, 2026

ఏకీకృత కుటుంబాల నమోదు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 27,865 ఏకీకృత కుటుంబాల నమోదు ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఎంఎస్‌ఈవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ గ్రామ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేలను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.

News March 10, 2026

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.