News April 30, 2024
IPL: లక్నో జట్టుకు గుడ్ న్యూస్

లక్నో జట్టుకు గుడ్ న్యూస్. ఆ జట్టు యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశారు. ఈ విషయాన్ని LSG బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించారు. దీంతో ముంబైతో జరిగే మ్యాచులో మయాంక్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని ఉపయోగించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 150KMPHకు పైగా వేగంతో బంతులు విసురుతూ మయాంక్ ఈ సీజన్‌లో సంచలనంగా మారారు.
Similar News
News March 14, 2026
NDAతో పొత్తు ఉండదు: విజయ్

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.
News March 14, 2026
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్‌సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.
News March 14, 2026
OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.


