News February 9, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.
Similar News
News February 10, 2026
CMపై భూకబ్జా ఆరోపణలు..రూ.500 కోట్లకు పరువు నష్టం దావా

రాష్ట్రంలో సుమారు 7,440 ఎకరాల భూమిని తాను, కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను అస్సాం CM హిమంత బిశ్వ శర్మ ఖండించారు. తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్‌పై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు SM ద్వారా CM తెలిపారు. ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలని డిమాండ్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో 376 పోస్టులు

న్యూఢిల్లీలోని <
News February 10, 2026
FLASH: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంకాలానికి కాస్త పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,58,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,45,550 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


