News February 9, 2026

రూ.3వేల కోట్లతో రోడ్ల నిర్మాణం: సీఎం

image

AP: వచ్చే మూడేళ్లలో అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో అన్నారు. పోలవరాన్ని 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీతో 16వేల టీచర్ ఉద్యోగాలు, 5వేల కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశామని, మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

Similar News

News April 19, 2026

రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

image

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

News April 19, 2026

పాక్‌లో రేపు చర్చలు.. డీల్ చేసుకోవాల్సిందే: ట్రంప్

image

ఇరాన్‌తో చర్చలకు తమ బృందం రేపు సాయంత్రానికి పాకిస్థాన్ చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదుర్చుకోకపోతే ప్రతీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్‌లను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. హార్ముజ్‌లో ఫ్రెంచ్, యూకే నౌకలపై ఇరాన్ బోట్లు దాడి చేయడం సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

News April 19, 2026

IPL: అద్భుత విజయం

image

IPL-2026: గెలుపు అసాధ్యం అనుకున్న దశలో KKR అద్భుత విజయం సాధించింది. RR నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70కే 5 వికెట్లు పడిన దశలో రింకూ (53*), అనుకుల్ రాయ్ (29*) బౌండరీలతో మ్యాచును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో KKRకు ఇదే తొలి విజయం.