News February 9, 2026
జనగామ: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి సమక్షంలో నిర్వహించారు. జనగాం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 66 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 80 మంది, APOలు 80, OPOలు240, స్టే.ఘ.లో 18 వార్డుల్లో 36 పోలింగ్ స్టేషన్స్‌కి 20% రిజర్వ్‌తో POలు 44 మంది, APOలు 44, OPOలు 132 మందిని నియమించారు.
Similar News
News February 16, 2026
ఇంత దానికేనా అంత డ్రామా!

T20 WCలో భారత్-పాకిస్థాన్ మ్యాచులో వార్ వన్ సైడ్ అయింది. టీమ్ ఇండియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక దాయాది తేలిపోయింది. దీంతో టోర్నీకి ముందుకు పాక్ ‘బాయ్‌కాట్’ డ్రామా ఆడింది ఇందుకేనా అంటూ భారత ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించి ఇండియాతో ఆడబోమంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. టోర్నీలో USA లాంటి చిన్న జట్లు మంచి పోటీ ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు.
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
పాలమూరు వర్సిటీ: రీకౌంటింగ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఫలితాలపై సందేహాలున్న వారు సబ్జెక్టుకు రూ.300 చొప్పున ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించాలని అధికారులు సూచించారు.


