News February 9, 2026
అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.
Similar News
News February 24, 2026
LIC, మ్యూచువల్ ఫండ్స్‌కు ఐటీ స్టాక్స్ షాక్!

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ స్టాక్స్ పతనం మ్యూచువల్ ఫండ్స్, LICపై ప్రభావం చూపిస్తోంది. ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన LIC రెండు నెలల్లో ₹42,500కోట్లు నష్టపోయింది. ఇన్ఫోసిస్, TCSలో పెట్టుబడులు ద్వారా ₹26,510కోట్లు కోల్పోయింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా ఐటీ షాక్ గట్టిగా తగిలింది. ఈ ఏడాదిలో ₹3.5లక్షల కోట్లను కోల్పోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ద్వారా దాదాపు ₹2లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News February 24, 2026
పచ్చిమేత పాడి పశువులకు ఎందుకు అవసరం?

పచ్చి మేతలో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీని వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి.. పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది.
News February 24, 2026
ప్లాన్ చేసి సీ సెక్షన్ చేయించుకుంటున్నారా?

సహజ ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సీ సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లలు లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు. అలాగే నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ సమస్యలు రావని మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.


