News April 30, 2024
10th Result: నల్గొండలో 41,250 మంది వెయిటింగ్

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. నల్గొండ జిల్లాలో 19,715 మంది, సూర్యాపేట జిల్లాలో 12,133, యాదాద్రి భువనగిరి 9,402 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
Similar News
News March 7, 2026
ఇండియన్ టీమ్‌కు గట్టుప్పల్ అమ్మాయి సెలెక్ట్

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గట్టుప్పల్ మండలానికి చెందిన పగిళ్ళ చందన ఎంపికైంది. భారత్ – థాయ్‌లాండ్ మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు థాయ్‌లాండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. సీనియర్ క్రీడాకారిణిగా చందన అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
నల్గొండకు నేడు ముగ్గురు మంత్రుల రాక

నల్గొండ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించనున్న ఈ భేటీ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
News March 6, 2026
NLG: ఇంటర్ పరీక్షలకు 261 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 9,796, మంది విద్యార్థులకు గాను 9,620 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1938 మంది విద్యార్థులకు గాను 1853 మంది హాజరుకాగా, 85 మంది గైర్హాజరయ్యారు.


