News February 9, 2026

కామారెడ్డి: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

కామారెడ్డిలోని పీఆర్టీయూ భవన్‌లో సోమవారం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. PRTU సంఘం ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ సమాజానికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

Similar News

News February 20, 2026

2028 SEP కల్లా ఐకానిక్ టవర్స్ రెడీ: నారాయణ

image

AP: అమరావతిలో సెక్రటేరియేట్ కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్‌ను 2028 SEP కల్లా రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘గతంలో 26,700 మంది ఉద్యోగులకు వీలుగా 52.72 L చ‌.అ. బిల్ట్ అప్ ఏరియా, 31.71 L చ‌.అ. కార్పెట్ ఏరియాతో వీటిని డిజైన్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు 39,882 మంది ఉన్నారంటున్నారు. నయా రాయ్‌పుర్, HYD సచివాలయ, సెంట్రల్ విస్టాను పరిశీలించాలని అధికారులకు సూచించాం’ అని సచివాలయంలో చెప్పారు.

News February 20, 2026

జగిత్యాల: సైబర్ మోసం.. నలుగురి అరెస్ట్

image

JGTL జిల్లా కేంద్రంగా విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన అంతర్జాతీయ సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్‌ను పోలీసులు ఛేదించారు. లావోస్ దేశానికి అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడేలా చేసిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బాధితుల పాస్‌పోర్టులు తీసుకుని బలవంతంగా మోసాలు చేయించారని వెల్లడించారు.

News February 20, 2026

మదనపల్లెలో ఏం జరుగుతోంది..?

image

మదనపల్లె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతోంది. కిడ్నీ రాకెట్, కల్తీ మద్యం, ఫైల్స్ దగ్ధం, హత్యాచారం, గంజాయి విక్రయాలు వంటి నేరాలు జరుగుతున్నాయి. నేర ప్రవృత్తిని ఎంత తగ్గించాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఇక్కడ ఉండే రౌడీలు, కిరాయి గూండాలను బెంగళూరులో దందాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.