News April 30, 2024

విల్లు ఎక్కుపెట్టడం నేరం కాదు: మాధవీలత

image

మసీదువైపు విల్లు ఎక్కుపెట్టానన్న ఆరోపణలతో బేగంబజార్ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హైకోర్టును కోరారు. ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు. తాను కేవలం శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెట్టాలని పోజ్ ఇచ్చానని, అందులో నేరపూరిత ఉద్దేశమేమీ లేదని న్యాయస్థానానికి తెలిపారు. తాను మసీదుకు ఎక్కుపెట్టాననడం, ముస్లింలను కించపరిచాననడం కేవలం దుష్ప్రచారమేనని విన్నవించారు.

Similar News

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.

News March 22, 2026

లక్ష్యాన్ని మించి రబీ సాగు!

image

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

News March 22, 2026

‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.