News April 30, 2024
కామారెడ్డి: అడవి పందిని ఢీకొని వ్యక్తి మృతి
అడవి పంది ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కుటుంబీకుల సమాచారం మేరకు మాచారెడ్డి మండలం సోమరంపేటకి చెందిన నునావత్ గంగారం మాచారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ను అడవి పంది ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News January 12, 2025
NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి
నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 12, 2025
NZB: జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 12 గంటలకు నిజామాబాద్‌లో జరిగే ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను కవిత ప్రారంభిస్తారు. అనంతరం ఒంటి గంటకు తబ్లిగీ జమాత్ వేదిక సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వర్ని బడాపహాడ్ దర్గాను దర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలలో సమావేశమై, పలు అంశాలపై చర్చిస్తారు.
News January 12, 2025
కాంగ్రెస్ సమాధానం చెప్పాలి: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ నాయకుల దాడిని MLC కవిత ‘X’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఆమె దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతను గూండాయిజం చేసేలా తీర్చిదిద్దుతోందని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై NSUI, IYC నాయకుల దాడి, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని మండిపడ్డారు. ఈ సిగ్గు చేటు ఘటనకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.