News February 9, 2026
నల్గొండలో రేపే సదస్సు.. మిస్ అవ్వకండి..!

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. నల్గొండలోని Alimineti Madhava Reddy Police Auditoriumలో FEB 10న సా.6 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు.
Similar News
News February 18, 2026
ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్‌పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్‌తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్‌లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News February 18, 2026
రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


