News February 9, 2026

మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 11న సెలవు: కలెక్టర్

image

ఈనెల 11న జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూర్, కేసముద్రం, డోర్నకల్‌లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు స్థానికంగా హాలిడే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 17, 2026

సంగారెడ్డి: నేటి నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి 24 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను సేకరించాలని సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు దోహదపడతాయన్నారు.

News February 17, 2026

ఎవరికో ఆ 11 మున్సిపాలిటీలు?

image

TG: నిన్న వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల పాలకవర్గ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. తొర్రూర్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, ఇల్లందు, సుల్తానాబాద్‌‌లో ఛైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్, BRS విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటికి ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించాయి. ఈ 11 మున్సిపాలిటీలు ఎవరి ఖాతాలో పడతాయో సాయంత్రానికి తేలిపోనుంది.

News February 17, 2026

BREAKING.. మంచిర్యాలలో భర్తను చంపిన భార్య..!

image

మంచిర్యాల జిల్లా మందమర్రి శాంతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్తనే ఓ భార్య అతికిరాతకంగా కత్తితో నరికి చంపింది. మోయిన్, అవంతి మతాంతర ప్రేమ వివాహం చేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. కాగా ఈ హత్యకు వేధింపులే కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంచిర్యాల ఆస్పత్రిలో మోయిన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.