News April 30, 2024
అనంతలో భగభగమంటున్న భానుడు

జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
Similar News
News March 21, 2026
అనంత జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో వినిపించేలా చేశారు: MLA

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వివిధ రంగాల్లో రాణిస్తూ అనంతపురం జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేశారని పురస్కారాల గ్రహీతలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఇందులో అనంతపురం జిల్లా నుంచి ముగ్గరికి స్థానం లభించింది.
News March 21, 2026
అనంత: టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను ‘Missile Woman of India’గా పిలవబడే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఆమె గతంలో అగ్ని-IV, అగ్ని-V క్షిపణులకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశంలోని క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె కావడం విశేషం.
News March 21, 2026
ముస్లింలు ఆర్థికంగా ఎదగాలి: అనంతపురం ఎంపీ

అనంతపురం అశోక్ నగర్ ఈద్గా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.


