News February 9, 2026
కల్తీ జరిగింది మీ హయాంలో కాదా: విడదల రజిని

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో CM CBNకు మాజీ మంత్రి విడదల రజిని కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘2024 JULY 6న వచ్చిన 2 ట్యాంకర్లు, JULY 12న వచ్చిన మరో 2 ట్యాంకర్ల నెయ్యిని TTD ల్యాబ్ పరీక్షించి, నాణ్యతా ప్రమాణాలు లేవని వెనక్కి పంపింది వాస్తవం కాదా? ఆ లారీలు దొడ్డిదారిన తిరిగి వచ్చింది మీ పాలనలోనే కదా? ఒకవేళ కల్తీ జరిగి ఉంటే అది మీ హయాంలోనే కదా? దీనికి మీ సమాధానమేంటి?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 24, 2026
‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.
News February 24, 2026
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం!

జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమ్రియా సమీపంలో సోమవారం సాయంత్రం కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగిందని చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధ్రువీకరించారు.
News February 24, 2026
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: YSRCP అధినేత YS జగన్ నేటి నుంచి 2రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు అక్కడికి చేరుకుని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రేపు ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం తిరిగి పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌కు హాజరై స్థానిక నేతలతో భేటీ అవుతారు.


